గల్ఫ్ దేశం కువైత్‌లో పెట్రోలియం వినియోగం భారీగా పెరిగినట్లు కువైత్ నేషనల్ పెట్రోలియం కంపెనీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 4.46 బిలియన్ లీటర్ల పెట్రోల్ వినియోగం జరిగింది. అంటే రోజుకు సగటున 12.2 మిలియన్ లీటర్లు. ఇది గతేడాదితో పోలిస్తే 26శాతం మేర పెరిగింది. ఇక దేశ పౌరులు, ప్రవాసులు కలిసి పెట్రోలియం కోసం రోజుకు సగటున 1.14 మిలియన్ కువైటీ దినార్లు (రూ. 30.67కోట్లు) వెచ్చిస్తున్నట్లు కంపెనీ డేటా ద్వారా తెలిసింది. దేశ జనాభా కూడా పెరుగుతుండడం, దానికి అనుగుణంగా వాహనాల వాడకం పెరగడంతో ఇంధనం, గ్యాసోలిన్ వినియోగం అమాంతం పెరిగింది.