పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 202 పరుగులు సాధించింది. బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ అర్ధ సెంచరీలు చేశారు. మెుత్తం ఆధిక్యాన్ని 281 పరుగులకు పెంచుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 107/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ 202 పరుగులవద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. వుడ్, రూట్ తలా రెండు వికెట్లు సాధించారు.