అమెరికాలో 18 ఏళ్ల విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నల్ల జాతీయుడైన జైలెన్ స్మిత్.. తూర్పు ఆర్కాన్సాస్ లోని ఏర్లే నగరానికి మేయర్ గా ఎన్నికయ్యాడు. అలా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అమెరికాలోని ఆఫ్రికన్ మేయర్స్ అసోసియేషన్ లోనూ ఆయన అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం. 1800 మంది నివసించే ఎర్లే నగరంలో ప్రజా భద్రతను మెరుగుపరుస్తానని, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని స్మిత్ ప్రజలకు హామీ ఇచ్చాడు.