సీఎం ఆకారంలో తయారు చేసిన భారీ క్రిస్మస్ కేక్ అందరినీ ఆకట్టుకుంటోంది. చెన్నై.. తిరుచ్చిలో సీఎం స్టాలిన్ ఆకారంలో 92 కేజీల భారీ కేక్ తయారు చేశారు. ఈ కేక్ ను 24 గంటలు శ్రమించి 90 కిలోల చక్కెర 80 కోడిగుడ్లతో బేకరీకి చెందిన నాలుగు బృందాలు కలిసి తయారుచేశాయి. తిరుచ్చి బేకరీ యాజమాన్యం తయారు చేసిన ఈ కేక్ ను సందర్శించడం సహా దాని ముందు సెల్ఫీ కూడా తీసుకోవచ్చని వెల్లడించారు.