ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మునుపెన్నడూ లేనంత స్థాయిల్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని , అయినా విజయం సాధించామని అన్నారు. బీజేపీ తమ కౌన్సిలర్లకు రూ.20 లక్షలు ఎరగా వేసి కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. జైళ్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ పై విషప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూసిందని ఆరోపించారు. ఆప్ కొత్త కౌన్సిలర్లో భేటీ సందర్భంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.