మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మహిళ తన 10 నెలల పాపతో కలిసి శనివారం ముంబయి-అహ్మదాబాద్ హైవేపై క్యాబ్ లో వస్తున్నారు. మార్గం మధ్యలో డ్రైవర్ సహా తోటి ప్రయాణీకులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చిన్నారిని లాక్కొని క్యాబ్ నుంచి విసిరేశారు. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమెనూ బయటకు నెట్టేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. మాండ్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.