ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని గుంటూరులో జరిగింది. తెనాలిలోని నందులపేటకు చెందిన గాయత్రికి(32) వివాహమై భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఐతానగర్‌కు చెందిన డ్రైవర్ పవన్‌తో పరిచయమైంది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శనివారంరోజు మహిళ పవన్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయక పోవటంతో మధ్యాహ్నం అతని ఇంటికి వెళ్లి గొడవపడింది. ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని చీరతో ఉరి వేసుకుంది. తలుపులను పగులగొట్టి హూటాహుటిన ఆస్పత్రికి తరలింగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.