మహారాష్ట్రలోని నాగపూర్, చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ మధ్య నడిచే ఆరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంట మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర నేతలు ఉన్నారు. అనంతరం మోదీ నాగపూర్ మెట్రో మొదటి దశకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నాగపూర్ మెట్రో ఫ్రీడమ్ పార్క్ స్టేషన్ లో ప్రధాని టికెట్ కొనుగోలు చేసి ఖాప్రీ వరకూ ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో విద్యార్థులతో ముచ్చటించారు.