ఇటీవల వింత కారణాలతో పీటలపైనే పెళ్లిళ్లు రద్దవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దని వధువు అందరికీ షాక్ ఇచ్చిన ఘటన యూపీ మహరాజ్ గంజ్ జిల్లా పనియార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డిసెంబర్ 8న పెళ్లి జరగాల్సి ఉండగా దండలు వేసుకునే సమయంలో వరుడిని చూసిన వధువు పెళ్లికి ససేమిరా అంది. వెంటనే మండపం దిగి కిందకు వచ్చేసింది. పోలీసులు, పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.