వరుస భారతీయుల హత్యలు కెనడాలో కలకలం రేపుతున్నాయి. వారం క్రితం బ్రాంప్టన్‌లో ఓ పంజాబీ యువతిని దుండగులు విచక్షణారహితంగా కాల్చిచంపిన ఘటనను మరవకముందే తాజాగా ఇదే కోవలో మరో దారుణం జరిగింది. కొలంబియాలోని సర్రేలో తన ఇంట్లోనే 40 ఏళ్ల ఓ సిక్కు మహిళ దారుణ హత్యకు గురైంది. బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కత్తితో పొడిచి చంపారు. మృతురాలిని పోలీసులు హర్‌ప్రీత్ కౌర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశామని అక్కడి పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa