మాండస్ తుఫాను ధాటికి నల్లమాడ పోలీస్ స్టేషన్ తడిసిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పోలీస్ స్టేషన్లోని పైకప్పు పెచ్చులూడింది. అంతేకాకుండా స్టేషన్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. దీంతో స్టేషన్లోని సామగ్రి తడిసిపోయింది. కంప్యూటర్లపై పోలీసులు కవర్లు కప్పగా, ముఖ్యమైన రికార్డులను పోలీసులు భద్రపరిచారు. ఓ వైపు బయటి నుంచి వర్షపు నీరు రావడం, మరోవైపు భవనం కారుతుండటంతో పోలీసుల ఇబ్బందులు పడ్డారు. 38 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం కావడంతో పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుంది. పోలీస్ స్టేషన్ నిర్మించిన కొత్తలో ఎత్తులోనే భవనం ఉండేదని, అయితే కాలక్రమేనా రోడ్లు వేయడంతో భవనం లోతట్టుకు వెళ్లిందని నల్లమాడ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్లో నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.