సారవకోట మండలంలోని పలు కుటుంబాలను వైఎస్సార్సీపీ సీఈసీ మెంబర్, సారవకోట మాజీ జడ్పిటిసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ఆదివారం పరామర్శించారు. అడ్డపనస గ్రామానికి చెందిన పట్టా షణ్ముఖరావు ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని, అలుదుకు చెందిన మెండ మన్మధరావు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహాశింగి గ్రామానికి చెందిన డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉరిటి రంజిత్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించారు. సర్పంచ్లు బాడాన కృష్ణారావు, శంకరబాబు, దండాశి, పార్టీ నాయకులు వరుదు వంశీకృష్ణ, నక్క తులసీదాస్, గెల్లంకి వెంకటరావు, రావాడ శ్రీనివాస రావు, ఎడ్ల రంగారావు తదితరులున్నారు.