ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 01:12 PM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి లక్ష్యమని నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలంలోని గొటివాడ పంచాయతీలో అక్కివలస, మహమ్మదప్పురం గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు వీధుల్లో సీసీ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎంపీపీ వాన గోపి, మండల ఉపాధ్యక్షుడు తంగి మురళీకృష్ణ, సర్పంచి ఎం. సూరమ్మ, చల్లవానిపేట, అల్లాడ పీఏసీఎస్ అధ్యక్షులు పాగోటి రాజప్పలనాయుడు, పొన్నాన ముసలినాయుడు, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com