ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేట్ బ్యాంక్ ఫ్రీ అకౌంట్లపై కరపత్రాలు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 01:21 PM

స్టేట్‌ బ్యాంక్‌ ఫ్రీ అకౌంట్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైస్‌ ఎంపీపీ సూడిపల్లి. కొండలరావు సూచించారు. హుకుం మండల కేంద్రంలోని గిరిజన సంఘం కార్యలయంలో వైస్‌ ఎంపీపీ కొండలరావు స్టేట్‌ బ్యాంక్‌ చీప్‌ మేనేజర్‌ శ్రీధర్‌ బాబుతో కలిసి శనివారం ఉచిత స్టేట్‌ బ్యాంక్‌ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్ ఎంపీపీ కొండలరావు మాట్లాడుతూ. అకౌంట్‌లు లేనివారు స్టేట్‌ బ్యాంక్‌ ప్రీ జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ అవకాశం సోమవారం వరకు మాత్రమే ఉందన్నారు. అకౌంట్‌ చేయడానికి ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని రఖాఖాస్తు ఫారం ఆధార్‌ కార్డ్‌ రెండు పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఉంటే సరిపోతుందని ఒకే గ్రామంలో 10 మంది ఉంటే ఆ గ్రామానికే వచ్చి అకౌంట్‌ ఓపెన్‌ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ శ్రీధర్‌ బాబు అకౌంట్‌ అసిస్టెంట్‌ సూర్యం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com