అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఈనెల 20, 21వ తేదీల్లో జరిగే సిఐటియూ మొదటి మహాసభలు జయప్రదం చేయాలని శనివారం సిఐటియూ మండల కార్యదర్శి కె. శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో సిఐటియు నాయకులు ప్రచారం నిర్వహించారు. మహాసభల కరపత్రాలను కార్మికులకు అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ. కార్మికులు పని చేసే చోట మౌలిక సౌకర్యాలు కల్పన ఉద్యోగ భద్రత కనీస వేతనం వంటి సమస్యల పరిష్కారం భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయన్నారు. ఆటో కార్మికుల యూనియన్ భవనం ఏర్పాటు ఆటో పార్కింగ్ ఏర్పాటు వంటి సమస్యలపై ఈ మహాసభల్లో ఏజెండా అంశాలుగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షుడు జి. నారాయణ కార్యదర్శి ఎంఎం. శ్రీను ఎస్. గాసిరందొర బలరాం డొంబ్రు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.