మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం బోయిలకింతాడ గ్రామంలో ఆదివారం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెఱకు కొనుగోలు కేంద్రం వద్ద ఈ సంవత్సరం క్రషింగ్ కోరకు రైతు సభ్యులు, కోనుగోలుకేంద్రం, ఫ్యాక్టరీ సిబ్బంది ఆధ్వర్యంలో దేవరాపల్లి మండల బి కింతాడ గ్రామ సర్పంచ్ బూరె బాబురావు, దేవరాపల్లి మండల వ్యవసాయ శాఖ సలహా సంఘం చైర్మన్ అన్నం రాము నాయుడు చేతుల మీదుగా చెఱకు రవాణా ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెఱకు కొనుగోలు కేంద్రం పరిధి వ్యవసాయ అధికారి వి కృష్ణమూర్తి , ఫీల్డ్ సిబ్బంది బేరా నారాయణరావు దుస్య వెంకట రమణ బుగత బాబురావు , రమేష్ గారు రైతు సభ్యులు గ్రామ పెద్దలు అన్నం రాము, కొప్పాక అప్పల నాయుడు , వియ్యపు రాజబాబు , నున్నగొప్పల నరిసింగరావు తుంపాల ఈశ్వరరావు గరికి శంకర రావు తదితరులు పాల్గొన్నారు.