ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు జీవితకాలం కెప్టెన్సీ చేపట్టకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్టీవ్ స్మిత్ స్పందించాడు. వార్నర్ పై కెప్టెన్సీ చేపట్టకుండా జీవితకాలం నిషేదం విధించడం తప్పని అభిప్రాయపడ్డాడు. తమ దృష్టిలో డేవిడ్ వార్నర్ ఓ నాయకుడు అని, అతనికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, 2018 లో దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినందుకు వార్నర్, స్మిత్ పై ఏడాది నిషేధం విధించారు. వార్నర్ పై అదనంగా జీవితకాలం కెప్టెన్సీ చేపట్టకుండా నిషేధం విధించారు.