మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలో పెద్దపులి కలకలం రేపింది. గోండే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికిపై పెద్దపులి దాడి చేయటంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పులిని చంపాలనుకున్నారు. కర్రలు, పదునైన ఆయుధాలతో సిద్ధమయ్యారు. కానీ, కొద్దిసేపటి తర్వాత పెద్దపులి మరో ఇద్దరిపై దాడి చేసి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పెంచ్ టైగర్ రిజర్వ్ అధికారి గ్రామానికి వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు క్రూరమృగాలు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవడం లేదంటూ అతడిపై దాడికి దిగారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఉన్నతాధికారులు భరోసా ఇవ్వటంతో గ్రామస్థులు శాంతించారు.