ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోటోల కోసం గొడవ.. తాళి కట్టనన్న వరుడు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 11:01 AM

పెళ్లిలో ఫొటోల కోసం ఇరుపక్షాల బంధువులు గొడవపడి గాయాలపాలైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. డియోరియా జిల్లాలోని మాధవ్‌పూర్‌లో అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది. వరమాల పూర్తవ్వగానే ‘మేం మొదట ఫొటోలు దిగుతాం’ అని అబ్బాయివారు, ‘లేదు మేమే ముందు దిగుతాం’ అని అమ్మాయి వాళ్ల మధ్య వాదన మొదలైంది. వాదన కాస్త భౌతిక దాడుల దాకా వెళ్లింది. ఫలితంగా ఇరుపక్షాల వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి అయితే వచ్చింది కానీ, ఈ ఘటనలతో విసుగు చెందిన వరుడు మాత్రం తాళి కట్టేందుకు ససేమిరా అన్నాడు. చివరకు మనసు మార్చుకుని తాళి కట్టడంతో కథ సుఖాంతమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com