ఏపీపై మాండూస్ తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాండూస్ తుఫాను రాష్ట్రంలోని రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. అతి భారీ వర్షాలు, ఈదురు గాలులతో చేతికొచ్చిన వరిపంట నేలరాలింది. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసి మొలకెత్తింది. కోత కోసి ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసి ముద్దయింది. మాండూస్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా. దీనిలో అధికశాతం వరి పంట ఉంది. అరటి, బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు కూడా నేలమట్టం అయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.