అత్త వరుసైన మహిళతో వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలితీసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. రాజుపాళెంకి చెందిన పర్లపాడు నరసమ్మ తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన పెద్ద దస్తగిరికిచ్చి పెళ్లి చేసింది. ఈ క్రమంలో పెద్దదస్తగిరి తమ్ముడు చిన్న దస్తగిరితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల చిన్న దస్తగిరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో నరసమ్మ అతడి వద్దకొచ్చి నేనుండగా వేరే పెళ్లి ఎలా చేసుకుంటావంటూ గొడవ పడింది. ఆవేశంలో చిన్నదస్తగిరిని పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.