టెక్నాలజీని ఎలా వాడుకోకూడదో చెప్పడానికి కొందరు యువకులు ఉదాహరణగా నిలిచారు. మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన ఎక్స్‌యూవీ 700(XUV 700) మోడల్ కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఇది డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ, అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. ఆటోడ్రైవింగ్ వెసులుబాటు కూడా ఈ కారులో ఉంది. దీనినే అదునుగా తీసుకున్న కొంతమంది యువకులు స్టీరింగ్ వదిలేసి కదులుతున్న కారులోనే జూదం ఆడటం మొదలు పెట్టారు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.