సమావేశం జరుగుతుండగా ఓ ముష్కరుడు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇటలీలోని రోమ్ నగరంలో చోటు చేసుకుంది. రోమ్ లోని ఓ బార్ లో అపార్ట్ మెంట్ బ్లాక్ నివాసితుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ ఆగంతకుడు వారిపై అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇటాలియన్ మీడియా వెల్లడించింది.