దేశంలో క్యాన్సర్ కేసులు విస్తృతంగా పెరగడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం నమోదైన క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య ఆధారంగా లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించింది సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ. ముఖ్యంగా క్యాన్సర్ కారక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 13వస్థానానికి చేరుకుంది. 2020ఏడాదిలో దేశంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య13.82లక్షల మంది ఉండగా అది రాబోయే మూడేళ్ల నాటికి 15.69లక్షలకు చేరుకుంటుందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేసింది. అంటే రెండేళ్లలోనే 12.8% కేసులు పెరుగుతాయని వెల్లడించింది.