మాండస్ తుఫాన్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, పాడైపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘పంట నష్టం అంచనాకు వెంటనే ఎన్యూమరేషన్ చేపట్టాలి. ధాన్యం కొనుగోల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కల్లా ల్లో ఉన్న పంట నీట మునిగి, రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. గతేడాది, ఈ ఏడాది నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి. లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం’’ అని అచెం నాయుడు హెచ్చరించారు.