అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 488 పాయింట్ల నష్టంతో 61,693 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ143 పాయింట్లు నష్టపోయి 18,353 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.61 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, విప్రో అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.