కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. అయ్యప్ప దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. శబరిమలలో భక్తుల సంఖ్య మూడు లక్షలు దాటింది. దీంతో గత అర్ధరాత్రి నుండి సర్వ దర్శనాన్ని నిలిపివేశారు. అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం 12 గంటలుగా క్యూలైన్లోనే ఎదురుచూస్తున్నారు. భక్తుల భారీ రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు. భక్తుల క్యూలైన్లు పంబా నుండే ప్రారంభమయ్యాయి. క్యూలైన్లు సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.