ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంతెన త్వరగా పూర్తిచెయ్యమని వేడుకొంటున్న ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 01:01 PM

అనంతపురం జిల్లా, ఓబుళదేవరచెరువు మండలంలోని సున్నంపల్లి సమీపాన సోమావతి నదిపై నిర్మించిన వంతెన మూడు నెలల క్రితం వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన మ రమ్మతులకు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల రింగులు వేసి, వదిలేశారు. మట్టి వేయలేదు. గత్యంతరం లేక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, రింగుల పైనుంచే వంతెన దాటుతున్నారు. ఏమాత్రం కాలుజారినా.. పట్టుతప్పినా గాయాలపాలు కావాల్సిందే. పలువురు కిందపడి, గాయపడ్డారు కూడా. అయినా పాలకులు, అధికారుల్లో చలనం లేదు. మూడు నెలలుగా ప్రజలు అవస్థలు పడుతున్నా.. మరమ్మతులు చేపట్టిన పాపాన పోలేదు. దీంతో ప్రజలు ఎన్నాళ్లీ తిప్పలు అని ఆవేదన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com