రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వైసీపీ నేతల నుంచి రక్షణ కల్పిం చాలని వీసీకే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూలకుంట శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీలేరులోని ‘బాస్’ కార్యాలయం లో ఆదివారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం శివాజీనగర్ దళితవాడలో 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ విగ్రహా న్ని అధికార వైసీపీ నాయకులు కూల్చివేశారని, ఇటీవల రాయచోటిలో అంబేడ్కర్ వర్ధంతి రోజునే ఆయన విగ్రహాన్ని సినీఫక్కీలో మాయం చేశారన్నారు. అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుండా మాజీ మంత్రి విశ్వరూప్ అడ్డుకోవ డమే కాకుండా ప్రతిఘటించిన దళితులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య, వివక్షపూరిత వైఖరికి నిరసనగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.