బెంగళూరులో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త రైల్వేస్టేషన్ ప్రయాణికులకు ప్రయోజనకరంగా లేదు. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రయాణికులు సంచరించేందుకు ఏర్పాటు చేసిన విమానాశ్రయం హాల్ట్ రైల్వే స్టేషన్‌కు నిత్యం కేవలం 18 మంది ప్రయాణికులు మాత్రమే సంచరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం మాత్రమే ఒక రైలు సంచరిస్తుండడం, పైగా అవి వారి టైమింగ్స్‌కు అనుకూలంగా ఉండకపోవటంతో ప్రయాణికులు అంతగా ఆసక్తి చూపట్లేదు. విమానాశ్రయంలో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు మాత్రమే ఇందులో సంచరిస్తున్నారు. రోజు పది టిక్కెట్‌లు అమ్ముడుపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మార్గంలో సంచరించే అన్ని రైళ్లు హాల్ట్ స్టేషన్‌లో నిలిపితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.