రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైయస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, సామాన్యుడికి కూడా పరిపాలన అందుబాటులో ఉండే విధంగా, ప్రతి చోటా పూర్తి పారదర్శకత ఉండే విధంగా సీఎం అనేక మార్పులు చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం ఆలోచన విధానం మేరకు వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. వాటిని ఇతర రాష్ట్రాల వారు కూడా గుర్తించారని, ఇక్కడికి వచ్చి చూసి వారి రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా మొదలు పెడుతున్నారని చెప్పారు. ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేని చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై నిత్యం విషప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి విలేకరుల సమావేశం నిర్వహించారు.