అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం నేడు డ్రగ్స్, గంజాయికి నిలయంగా మార్చివేసిందంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా,కామవరపు కోట మండల తెలుగు యువత ఆధ్వర్యంలో తడికలపూడి పోలీస్‌స్టేషన్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తెలుగు యువత నాయకుడు నూతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.... ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం సరఫరా చేస్తూ అన్నపూర్ణగా ఖ్యాతి చెందిన ఏపీ నేడు జగన్‌రెడ్డి పాలనలో డ్రగ్స్‌కి, గంజాయికి నిలయంగా మారిందని విమర్శించారు. 2021–22లో కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలో ఎక్కువ ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలో పేర్కొందన్నారు.