బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహనరంగా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాధా, రంగా రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన కాపునాడు బహిరంగ సభ పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడారు. ‘‘ఈ నెల 26న వంగవీటి 34వ వర్ధంతితో పాటు కాపునాడు బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులంతా హాజరుకావాలి. కాపుల అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం చేపట్టినా నేను ముందుంటా’’ అని అన్నారు.