పులివెందుల పట్టణంలోని మోడల్ టౌన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ విజయరామరాజు పరిశీలించారు. ఇదే క్రమంలో అంబకపల్లి నగరవణంలో జరుగుతున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. పనులను నాణ్యతగా వేగవంతంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్థి అనిల్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు.