దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గడిచిన మూడేళ్లలో దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేర రుణాలు రద్దు చేసి మొండి బకాయిలు గా ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. అత్యధికంగా స్టేట్ బ్యాంకు 2018-22 వరకూ రూ.1.64,735 కోట్ల మేరకు రుణాలు రద్దు చేసినట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.61,763 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.59,807 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.52,655 కోట్లను ఎన్ పీఏలుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.