రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఓ వివాహ వేడుకలో సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. మృతుల్లో 9 మంది చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారని జిల్లా రూరల్ ఎస్పీ అనిల్ కయల్ తెలిపారు. ఈ ఘటనలో 60 మంది గాయపడ్డారు. ప్రస్తుతం 34 మంది చికిత్స పొందుతున్నారు. అయితే మహాత్మా గాంధీ ఆస్పత్రిలో చేరిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.