తమిళనాడు ధర్మపురికి చెందిన గణేశన్ అనే రైతు తన కుటుంబాన్ని గ్రామస్థులు కొంతకాలంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. ఇంటికి కూడా వెళ్లనివ్వకుండా చుట్టూ గోడలు కట్టి అట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వినూత్న రీతిలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాడు. ఇంటికి హెలికాఫ్టర్ లో వెళ్లడమే సరైన మార్గమని నిర్ణయించుకుని బొమ్మ హెలికాఫ్టర్ తో పాటు వినతి పత్రాన్ని చేతపట్టుకొని కలెక్టరేట్ ఎదురుగా బైఠాయించారు. తమ ఇంటిపై హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యేలా చూడాలని నిరసన చేపట్టారు.