అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డర్ వద్ద యుద్ధ విమానాలతో భారత్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. అరుణాచల్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జోరుగా పెట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. చైనా ఉల్లంఘనలను అడ్డుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి భారత వైమానిక దళాలు పెట్రోలింగ్ చేపడుతున్నట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. మరోవైపు, తవాంగ్ ఘటనకు సంబంధించి ఇవాళ పార్లమెంట్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు ప్రకటన చేయనున్నారు.