ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంటికి సోమవారం ఆయన పుట్టినరోజునే బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఆయన్ను హత్య చేస్తామంటూ దుండగులు బెదిరించడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాల్ డేటా విశ్లేషించిన పోలీసులు బీహార్ కు చెందిన నారాయణ్ సోనీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ వ్యక్తి ఇదివరకే పలుమార్లు పవార్ ఇంటికి కాల్ చేశాడని.. అతన్ని మందలించి వదిలేశామని పోలీసులు తెలిపారు.