భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు నిలకడగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద భారత్- చైనా జవాన్ల మధ్య ఘర్షణపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందించారు. ‘మాకు తెలిసినంత వరకు చైనా-భారత్ సరిహద్దు పరిస్థితులు మొత్తం మీద స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు అంశంపై దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఎటువంటి అడ్డంకుల్లేనే చర్చలు కొనసాగుతున్నాయి’ అని చెప్పారు. కాగా, సరిహద్దు వివాదంపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ.. భారత భూభాగాన్ని చైనా సైనికులు ఆక్రమించేందుతు యత్నించగా, బలంగా తిప్పికొట్టినట్లు చెప్పారు.