కరెన్సీ నోట్లపై మార్పులకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతంలో ఆర్బీఐ మాటలనే మరోసారి పునరుద్ఘాటించింది. మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలిగించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది. కరెన్సీ నోట్లపై చిత్రాలకు సంబంధించి అనేక అభ్యర్థనలు, సూచనలు స్వీకరించామని, దీనిపై ఈ ఏడాది జూన్ 6న ఆర్బీఐ పత్రికా ప్రకటన విడుదల చేసిందని తెలిపింది. కరెన్సీ నోట్లపై చిత్రాలకు సంబంధించి కాంగ్రెస్ నేత ఆంటోని అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa