ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ జాతీయ స్థాయిలో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. టెలి-కన్సల్టేషన్ విభాగంలో, గ్రామ ఆరోగ్య క్లినిక్‌ల విభాగంలో ఏపీ ఈ అవార్డులను అందుకుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవ్య చేతుల మీదుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ అవార్డులను అందుకున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్‌తో మంత్రి విడదల రజనీ, ఎంటీ కృష్ణబాబు భేటీ అయ్యారు. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ అందుకున్న అవార్డులను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజనీ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను సీఎం జగన్ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa