ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్ని రోజులుగా తీవ్ర రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణీకులు అని చెకింగ్స్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక సూచనలు చేసింది. నిర్దేశిత సమయానికి మూడున్నర గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది. తమ వెంట 7 కిలోలకు మించకుండా లగేజీని తీసుకురావాలని.. ప్రయాణీకులు 5,6 గేట్ల ద్వారా టెర్మినల్ 3కి చేరుకుంటే దగ్గరవుతుందని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa