తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర హైకోర్టు నెల రోజుల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఈ నెల 27లోగా జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. టీటీడీకి చెందిన ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని గతంలో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ముగ్గురి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను టీటీడీ అమలు చేయడం లేదని ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa