ఆకాశంలో బుధవారం అద్భుత దృశ్యం కనిపించనుంది. ఈ ఏడాదిలో చివరి ఉల్కాపాతం భూమికి అత్యంత దగ్గరగా రానుంది. 'జెమినిడ్స్’ ఉల్కాపాతం ఈ నెల 4 నుంచి ఆకాశంలో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఉల్కాపాతం బుధవారం రాత్రి గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. గరిష్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఉల్కాపాతం శిథిలాలు సెకనుకు 70 కి.మీ వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. వీటిని టెలిస్కోప్ లేకుండానే ఎక్కడినుంచైనా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు ఉల్కాపాతం గరిష్ఠ స్థాయిని చేరుకొంటుందని, రాత్రి 9 గంటలకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.