ఫిఫా ప్రపంచకప్ 2022 తుది ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే ఒక సెమీఫైనల్ పూర్తవగా, నేడు రెండో సెమీఫైనల్ జరగనుంది. తొలి సెమీఫైనల్లో క్రొయేషియాను ఓడించి అర్జెంటీనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఫైనల్లో అర్జెంటీనాను ఢీకొట్టే జట్టు ఏదో నేడు తేలనుంది. రాత్రి 12.30 గంటలకు ఫ్రాన్స్, మొరాకో మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. డిపెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను ఎదుర్కోవడం మొరాకోకు అంత సులభమేమీ కాదు. మొరాకో ఇప్పటివరకు అనూహ్య ప్రదర్శన కనబర్చింది. ఈ పోరాట స్పూర్తినే కొనసాగించి విజయం సాధిస్తుందో లేదో చూడాల్సిందే.