కేరళలోని విజయన్ ప్రభుత్వం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు షాకిచ్చింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్ గా వ్యవహరించే విధానానికి స్వస్తి పలికే బిల్లుకు శాసనసభ ఆమోదించింది. విద్యారంగ నిపుణులను ఆ పదవిలో నియమించడానికి వీలు కల్పించింది. కాగా, ప్రతిపక్ష యూడీఎఫ్ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే పలు మార్పులు సూచించింది. అధికార పార్టీ ఈ మార్పులను ఆమోదించకపోవడంతో సభ నుండి ప్రతిపక్షం వాకౌట్ చేసింది. విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ ఏఎన్ షంపీర్ ప్రకటించారు. కాగా, ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్ ఆరిఫ్ తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.