ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడి స్థానాన్ని కోల్పోయారు, ట్విట్టర్ కొనుగోలుతో ఆయన సంపద గణనీయంగా తగ్గుతుంది. దీంతో అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని మస్క్ కోల్పోయారు. 340 బిలియన్ డాలర్లుగా ఉన్న మస్క్ సంపద, ట్విట్టర్ కొనుగోలుతో 168 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్ బర్గ్ బిలీయనీర్స్ ఇండెక్స్ ప్రకారం 172.9 బిలియన్ డాలర్ల సంపదతో ఫ్యాషన్ సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు.