ఫిఫా ప్రపంచ కప్ 2022 లో అర్జెంటీనా ఫైనల్ కు చేరింది. క్రోయేషియాతో జరిగిన సెమీఫైనల్లో 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. ఫస్టాఫ్ లో మెస్సీ, అల్వరెజ్ చెరో గోల్ కొట్టడంతో 2-0తో లీడ్ లోకి వెళ్లింది. సెకండాఫ్ లోనూ అదే జోరు కొనసాగిస్తూ అల్వరెజ్ రెండో గోల్ కొట్టాడు. దీంతో అర్జెంటీనా 3-0 తో నిలిచింది. క్రోయేషియాకుకు గోల్ చేసే అవకాశమే ఇవ్వకుండా అర్జెంటీనా ఆధిపత్యం చెలాయించింది. కాగా, ఫైనల్లో గెలిస్తే లియోనెల్ మెస్సీ ఇన్నాళ్ల ప్రపంచకప్ కల తీరినట్లే.