ఎలాంటి వారికైనా సులభమైన వ్యాయామం నడక. అయితే అంతా ముందుకే నడుస్తుంటారు. కానీ వెనక్కు నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెనక్కు నడవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడి.. ఆలోచనా నైపుణ్యాలు పెంపొందుతాయి. అలాగే తక్కువగా ఉపయోగించే కండరాల్లో బలాన్ని పెంచుతుంది. జీవక్రియను బలోపేతం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జర్నల్ ఆఫ్ బయో మెకానిక్స్ అధ్యయనం ప్రకారం ఫార్వర్డ్ రన్నింగ్ తో పోలిస్తే వెనుక వైపు పరుగు మోకాలి నొప్పులను తగ్గిస్తుందని చెబుతున్నారు.